Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ను క‌లిసిన బండి సంజ‌య్‌.. ఫొటోలు ఇవిగో

bandi sanjay meets devender goud
  • నిన్న దేవేంద‌ర్ గౌడ్ నివాసంలో భేటీ
  • రాజకీయాలు సహా పలు అంశాలపై చర్చించామన్న సంజ‌య్
  •  దేవేందర్‌ గౌడ్ బీజేపీలో చేర‌నున్నారా? అంటూ నెటిజన్ల కామెంట్లు  
మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ను కొన్ని నెల‌ల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  క‌లిసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కాంగ్రెస్ లో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, దేవేంద‌ర్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌లేదు. తాజాగా, ఆయ‌న‌ను  బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ క‌లిసి, రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించారు. ఈ విష‌యాన్ని బండి సంజ‌య్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.
                 
'సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీ దేవేందర్ గౌడ్ గారిని నిన్న వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలు సహా పలు అంశాలపై చర్చించాము' అని బండి సంజ‌య్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో దిగిన ప‌లు ఫొటోల‌ను బండి సంజ‌య్ పోస్ట్ చేశారు. దీంతో  దేవేందర్‌ గౌడ్ బీజేపీలో చేర‌నున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  
        
Devender goud
Bandi Sanjay
BJP

More Telugu News